ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత సైనికులకు మద్దతుగా వాకాడులో శుక్రవారం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అశోక్ సెంటర్ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం, జైహింద్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.