నెల్లూరు జిల్లా కందుకూరులోని టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కందుకూరు డిఎస్పి బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా కందుకూరు పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 9. 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ శిబిరంలో రక్తదానం చేయడానికి ప్రజలు, యువత ముందుకు రావాలని కోరారు.