గుడ్లూరు: ఎంపీడీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలు దర్నా

52చూసినవారు
గుడ్లూరు: ఎంపీడీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలు దర్నా
తల్లికి వందనం పథకాన్ని తమకు కూడా వర్తింపచేయాలని అంగన్వాడీలు గుడ్లూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వ పథకాలు అంగన్వాడీలకు అందేందుకు 2022లో ఇచ్చిన జీవో అమలు కావడం లేదన్నారు. సచివాలయం యాప్లలో నమోదు చేసి డేటా కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వీరికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్