నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడ్డాయి. గుండ్లపాలెం గ్రామంలో బచ్చు సుధాకర్ అనే వ్యక్తి ఇంటిదగ్గర కట్టేసి ఉన్న గేదె పిడుగుపాటుతో మృతి చెందింది. దీంతో ఆ వ్యక్తి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మృతి చెందిన గేదె విలువ రూ. 1 లక్ష పైన ఉంటుందని, తనకు తీవ్ర నష్టం జరిగిందని విలపించాడు.