
మాలీ ఉగ్రవాదుల చెరలో తెలుగు వారు
పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై అల్-కాయిదా అనుబంధ ఉగ్రవాదులు దాడి చేసి ముగ్గురిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఏపీకి చెందిన రమణ, మిర్యాలగూడకు చెందిన అమరలింగేశ్వర్, మహారాష్ట్రకు చెందిన జోషి ఉన్నారు. ఉగ్రవాదుల చెర నుంచి భారతీయులను విడిపించాలని ఇండియన్ ఎంబసీ మాలి అధికారులతో సంప్రదింపులు జరుపుతుంది. తమ వారు ఎలా ఉన్నారోనని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.