పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా కందుకూరులో టీడీపీ నాయకులు, అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలను మంగళవారం అత్యంత ఉత్సాహంతో నిర్వహించారు. కందుకూరులోని వెంకటనారాయణ బజార్‌లోని అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కటింగ్ చేశారు. అలాగే అన్నా క్యాంటీన్‌లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా పేద ప్రజలకు ఉచిత భోజనం అందించనున్నట్లు తెలిపారు.