ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం పేద తల్లులకు అండగా నిలుస్తోందని, ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అందరికీ లబ్ధి కలగడం ఇదే మొదటిసారి అని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పాఠశాలలు ప్రారంభమైన రోజే తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ద్వారా ప్రభుత్వానికి చదువుకునే విద్యార్థులు పట్ల నిబద్ధత స్పష్టమవుతోందని తెలిపారు.