ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య ఉత్తర క్రియల కార్యక్రమం కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి టీడీపీ నాయకులతో కలసి పాల్గొని కంచర్ల రామయ్య చిత్ర పటానికి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.