కందుకూరు నియోజకవర్గం పరిధిలో గల పందల పాడు గ్రామ సచివాలయం లోని అంగన్వాడి కేంద్రంలో "కిషోరి వికాసం" కార్యక్రమంపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పందల పాడు గ్రామ సర్పంచ్ కె. పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళ పోలీస్ గుండ్ల గిరిజ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమని, బాల్య వివాహాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కిషోర బాలికలకు చట్టాలపై అవగాహన కల్పించారు.