కందుకూరు: ఈనెల 17వ తేదీన పొగాకు రైతులు కొరకు సదస్సు

51చూసినవారు
కందుకూరు: ఈనెల 17వ తేదీన పొగాకు రైతులు కొరకు సదస్సు
పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీన కందుకూరులో సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం నాయకుడు ముప్పరాజు కోటయ్య తెలిపారు. ఈ సదస్సుకు సంబంధించిన గోడపత్రికను కందుకూరు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి పండించిన పొగాకు పంటకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు.

సంబంధిత పోస్ట్