నెల్లూరు జిల్లా కందుకూరులోని శ్రీ జనార్ధన స్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్న శ్రీదేవి భూదేవి సహిత శ్రీ జనార్ధన స్వామిని భారీ సంఖ్యలో భక్తుల తరఫున దర్శించుకున్నారు. ఎంతో ప్రశాంతంగా క్యూ లైన్ లో నిల్చొని భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.