కందుకూరు: పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

78చూసినవారు
కందుకూరు: పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
చేయి చేయి కలుపుదాం.. ఆపదలో ఉన్న వారిని ఆదుకుందాం అంటూ కందుకూరు పట్టణంలోని వాసవి క్లబ్ లెజెండ్స్ వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను సోమవారం అందజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర మీద వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు వెండి డాలర్లు బహుమతులుగా ఇచ్చారు. అలాగే విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్