కందుకూరు: పోయిన సెల్ ఫోన్ అందజేసిన మహిళ కానిస్టేబుల్

66చూసినవారు
కందుకూరు: పోయిన సెల్ ఫోన్ అందజేసిన మహిళ కానిస్టేబుల్
కందుకూరు సిఐ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కంభం అనూష మంగళవారం విధులు పూర్తిచేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో ఒక సెల్ ఫోన్ దొరికింది. ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వగా వెంటనే ఆమె ఇంటికి వెళ్లి సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టింది. సెల్ ఫోన్ పోగొట్టుకున్న పాలూరు గ్రామానికి చెందిన పొనుగోటి మధు ఆ సెల్ ఫోన్ కు ఫోన్ చేసి పోయిన విషయం తెలపడంతో ఆ వ్యక్తికి అనూష ఫోన్ అందజేసింది.

సంబంధిత పోస్ట్