కందుకూరులో ఈనెల 15వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను కందుకూరు నియోజకవర్గం ప్రజలందరూ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రికి మన కందుకూరు నియోజకవర్గం ప్రజలు ఇచ్చే వెల్కమ్ గుర్తుండిపోవాలని అన్నారు. ఆయన మనకు ఎన్నో ఇస్తున్నారని మనం ఇవ్వగలిగింది కేవలం ఘన స్వాగతం మాత్రమే అన్నారు.