కందుకూరులో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. శనివారం ఎస్సై శివ నాగరాజు రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను అక్కడి నుంచి తొలగించారు. వ్యాపారులకు సూచించి, తమ షాపుల వద్దకు వచ్చే కస్టమర్ల వాహనాలను ఫుట్‌పాత్ మీదనే పార్కింగ్ చేసేలా చూడాలని సూచనలిచ్చారు. దీనివల్ల రోడ్లు సజావుగా, సురక్షితంగా ఉంటాయని వివరించారు.