కందుకూరు: ట్రాఫిక్ సమస్య నియంత్రణకు చర్యలు

53చూసినవారు
కందుకూరు: ట్రాఫిక్ సమస్య నియంత్రణకు చర్యలు
కందుకూరులో ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఎస్సై శివ నాగరాజు కందుకూరు టౌన్ లో పర్యటించి రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేసిన వారిని అక్కడి నుంచి తీయాలని హెచ్చరించారు. వ్యాపారులు తమ షాపుల వద్దకు వచ్చే కస్టమర్లకు వాహనాలను ఫుట్ పాత్ మీద పార్కింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా వాహనాలు నిలిపితే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్