కందుకూరు: విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే
By Sundhar VS 73చూసినవారుఅత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభినందించారు. కందుకూరు పట్టణంలోని నారాయణ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన షేక్. రైజా 990/1000, ఎం. శరణ్య 989/1000, మరియు బి. గీతిక 989/1000 విద్యార్థులను కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి శాలువాతో సత్కరించి అభినందించారు.