కందుకూరు పట్టణానికి చెందిన వడ్లమూడి చెంచునారాయణ మనవడు అన్నూ కౌషిక్ నరసింహ ఇటీవల జరిగిన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 225వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం వడ్లమూడి చెంచునారాయణ నివాసానికి వెళ్లి అన్నూ కౌషిక్ నరసింహకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా కౌషిక్ నరసింహను ఎమ్మెల్యే శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు.