కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామంలో సచివాలయం వద్ద కె. జి. టి రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు 70 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన బిటి రోడ్డు మరియు సైడ్ కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. వలేటివారిపాలెం మండలం కలవళ్ల గ్రామంలో 31. 06 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన 2 గోకులం షెడ్లు మరియు నూతన సి. సి రోడ్డు ను ఎమ్మెల్యే ప్రారంభించారు.