లింగసముద్రం మండలం ముత్యాలపాడు గ్రామంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ కోదండ రామస్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు, వేద పండితులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.