కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం కందుకూరు పట్టణ పరిధిలోని దివివారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతా సమేత కోదండరామస్వామి దేవస్థానంలో జరిగిన విగ్రహ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ మండపంలో ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. దివివారిపాలెం గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు.