కందుకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. ప్రజలందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. రాజ్యాంగాన్ని సృష్టించి మనకు ఒక దారి చూపిన మహానుభావుడు అని కొనియాడారు.