లింగసముద్రం మండలం మాలకొండరాయుని పాలెం గ్రామానికి చెందిన చేబ్రోలు జ్యోతి అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. కందుకూరు టిడిపి ఆఫీసులో బుధవారం సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ. 65939/- చెక్కును ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల ఆరోగ్య విషయంలో ఆపద్బాంధవుడిలా ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకి, ఎమ్మెల్యే కి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.