కందుకూరు పట్టణంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత దేశ ప్రజల క్షేమం కోసం పాకిస్థాన్ పై యుద్ధం చేసిన సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీని చేపట్టారు. ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి, 140 కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి భారత త్రివిధ దళాలు, ముఖ్యంగా వాయు సేన చేసిన ఆపరేషన్ సింధూర్ భారతదేశంతో పాటు ప్రపంచం చరిత్రలో గుర్తుండి పోతుందని ఎమ్మెల్యే అన్నారు.