నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని అనంతసాగరం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాల మహేంద్ర నాయక్ తెలిపారు.