కందుకూరు: వాహనదారులకు అవగాహన కల్పించిన ఆర్టీవో

58చూసినవారు
కందుకూరు: వాహనదారులకు అవగాహన కల్పించిన ఆర్టీవో
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డు జంక్షన్ లో కందుకూరు ప్రాంతీయ ఆర్టీవో టివిఎన్ లక్ష్మీ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులతో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. అలాగే కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. మాకు భయపడి కాదు మీ రక్షణ కోసం మీరే జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్