నెల్లూరు జిల్లా కందుకూరులో అటానమస్ హోదా ఉన్న టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. బి.ఏ లో 85%,బి.ఎస్్సి లో 84%,బి. కామ్ లో 72% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ డా. రవికుమార్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కోర్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఆయన కోరారు.