కందుకూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ రద్దు చేయాలని కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి మండల సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వారు ఆ ప్రాంతంలో పర్యటించారు. వారు మాట్లాడుతూ పలు ప్రభుత్వ కార్యాలయాలు, వందల ఏళ్ల నాటి వృక్షాలు ఉన్న ప్రాంగణంలో నామమాత్రపు లీజుకు పెట్రోల్ బంక్ ఏర్పాటుకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సహకారంతో నిర్మాణ పనులు అడ్డుకున్నామన్నారు.