కందుకూరు పట్టణంలోని 6వ వార్డు సుందరయ్య నగర్ కాలనీలో మంచినీటి పబ్లిక్ కుళాయిలు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందరయ్య నగర్ కు వచ్చిన ఇంటూరి కి స్థానిక ప్రజలు సమస్యలు చెప్పుకోగా అధికారంలోకి రాగానే మీ సమస్యకు పరిష్కారం చూపిస్తానని మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పబ్లిక్ కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీటిని అందజేసినట్లు స్థానిక ప్రజలు తెలిపారు.