ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కందుకూరు పట్టణంలో ఆ పార్టీ మండల నాయకత్వం ఆధ్వర్యంలో శనివారం సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. రెండుసార్లు మోడీ నాయకత్వంలో వరుసగా బిజెపి దేశాన్ని అభివృద్ధిలో నడిపిస్తుందని, ఇందుకుగాను ఢిల్లీ ప్రజలు కూడా బిజెపికి పట్టం కట్టారని కందుకూరు బీజేపీ నాయకులు అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం మోడీకే సాధ్యం అన్నారు.