కందుకూరు: యోగ అవసరంగా కాదు అలవాటుగా మార్చుకోవాలి

60చూసినవారు
కందుకూరు: యోగ అవసరంగా కాదు అలవాటుగా మార్చుకోవాలి
నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో యోగాంధ్రా-2025 కార్యక్రమాన్ని పురస్కరించుకొని శనివారం యోగాసనాలు వేశారు. అధికారులందరూ ఈ కార్యక్రమంలో తెల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు. యోగ అనేవి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది అన్నారు. మారుతున్న జీవన శైలిలో యోగా చేయడం మనిషికి ఎంతో అవసరం అని తెలిపారు. యోగ చేయడం అవసరంగా కాకుండా అలవాటుగా మార్చుకోవాలి అన్నారు.

సంబంధిత పోస్ట్