కందుకూరు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో ఖాళీగా ఉన్న పలు రూములను లీజుకు ఇచ్చేందుకు ఈనెల 18వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అనూష తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ రైతు బజార్ పక్కన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో 5 రూములు, ఏరియా హాస్పిటల్ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ లో 2 రూములు, కేకేఆర్ కాంప్లెక్స్ లో 2, ముత్యాలకుంట పార్కు వద్ద ఒక రూమును లీజుకు ఇచ్చేందుకు వేలంపాట జరుగుతుందన్నారు.