కందుకూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

67చూసినవారు
కందుకూరు: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
కందుకూరు ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సిఎంఆర్ఎఫ్ చెక్కులను, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓ సి) లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తోందన్నారు. పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్