కందుకూరు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో భారీ దొంగతనం

77చూసినవారు
కందుకూరు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో భారీ దొంగతనం
కందుకూరు పట్టణంలోని వాసవి నగర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. అక్కడ నివాసం ఉంటున్న మోటుపల్లి సురేంద్ర అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో దొంగలు చొరబడి 15 సవర్ల బంగారం, 6 కేజీల వెండి, రూ. 3 లక్షల నగదు దొంగతనం చేసినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం ద్వారా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్