ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు నేతృత్వంలో శనివారం సాయంత్రం 5 గంటలకు కందుకూరు పట్టణంలో ఎన్టీఆర్ బొమ్మ వద్ద నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు ఘనంగా తిరంగా యాత్ర ర్యాలీ జరుగనుంది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఇంటూరి పిలుపు మేరకు ఆయన కార్యాలయం ఒక ప్రకటన ద్వారా కోరింది.