ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందుకుగాను శనివారం కరేడులో గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పాల్గొని మాట్లాడారు. రైతులకు ఇష్టం లేకుండా ఒక్క ఎకరం కూడా తీసుకునే దమ్ము ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మా భూములు బలవంతంగా లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు.