మహా కుంభమేళ పవిత్ర జలాలను కందుకూరు స్కందపురి ఉద్యానవనం పక్కన ఉన్న హనుమాన్ బజరంగీ సెంటర్ వద్ద భక్తులకు ఆదివారం పంపిణీ చేశారు. విహెచ్షి, ఆర్ఎస్ఎస్, బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి 6 గంటల వరకు కుంభమేళా పవిత్ర జలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తన్నీరు మల్లికార్జున, వలేటి కొండప నాయుడు, ఘట్టమనేని హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.