లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు రిజర్వాయర్‌ను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నారుల కోసం పార్క్, బోటింగ్ వంటి వినోదం కలిగించే సదుపాయాలు ఏర్పాటు చేయాలంటున్నారు. కందుకూరుతో సంబంధాలు ఉన్న టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఈ విషయంలో శ్రద్ధ చూపాలని వారు కోరుతున్నారు.