లింగసముద్రం ఎస్సీ హాస్టల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న పల్లెపాటి సందీప్ హాస్టల్ వద్ద ఆడుకుంటుండగా విద్యుత్ షాక్ తగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు కందుకూరి ఏరియా వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వెళ్ళమని వైద్యులు సూచించారు. దాంతో ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించారు. విద్యార్థికి న్యాయం చేయాలని విద్యార్థులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.