కందుకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ. ఎందరో మహనీయుల ప్రాణత్యాగం వల్ల మనకు స్వాతంత్రం లభించిందని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుదామని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.