ఉలవపాడు మండలం రామాయపట్నం సముద్ర తీర ప్రాంతాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు శనివారం పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్ర తీర ప్రాంతం అంతా కొట్టుకుపోయింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు తెలియజేయాలని తెలిపారు.