కందుకూరులో జాతీయ నేత్రదాన పక్షోత్సవం

83చూసినవారు
కందుకూరులో జాతీయ నేత్రదాన పక్షోత్సవం
కందుకూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం బుధవారం నిర్వహించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శకుంతల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేత్రదానం ఆవశ్యకత గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది నేత్రదాన అంగీకార పత్రాలను ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సౌమ్య స్రవంతికి అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఇంద్రాణి, కళ్యాణ్, డాక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్