కందుకూరులో ఇంటర్ ఆన్సర్ షీట్స్ ట్యాంపరింగ్ కి పాల్పడిన శ్రీ వివేకా జూనియర్ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ టాంపరింగ్ తో నష్టపోయిన పేద విద్యార్థులకు ఇంటర్ బోర్డు మార్కులు కలిపి న్యాయం చేసిందన్నారు. అయినప్పటికీ అక్రమాలకు భరితెగించిన శ్రీ వివేకా కాలేజీ గుర్తింపు రద్దు చేస్తేనే మిగిలిన వారికి గట్టి సంకేతం అవుతుందన్నారు.