నెల్లూరు జిల్లా సంగంలో జమీల అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. సీఐ వేమారెడ్డి వేధింపులే తన చావుకు కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. చేజర్ల మండలం ఆదరుపల్లిలోని ఇంటి వివాదంలో రెవెన్యూ అధికారులు ఇల్లు జమీలదేనని తేల్చినప్పటికీ ఆమెను 8 నెలలుగా ఇంట్లోకి వెళ్లనివ్వడంలేదని ఆరోపించారు. ఆమె సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.