ఉలవపాడు మండలం టెంకాయచెట్లపాలెంలో విద్యుత్ షాక్ తో గోపి(15) అనే బాలుడు మరణించాడు. కావలి మండలం తాడి చెట్లపాలెంకు చెందిన అతను తన సోదరి ఇంటి వద్ద ఉంటూ ఉలవపాడులో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం పిల్లలు ఆడుకుంటున్న గాలిపటం విద్యుత్తు తీగలపై ఇరుక్కుపోయింది దాన్ని గోపి పక్కనే ఉన్న ఇనుప పైపుతో తీస్తుండుగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.