ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఉలవపాడు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. ఉలవపాడు మండలం మన్నేటికోట నుంచి లారీలో కర్ర లోడు చేసుకుని వస్తుండగా మార్గం మధ్యలో విద్యుత్ వైర్లను గమనించి డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. సూర్యనారాయణ అనే కూలి లారీ నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు.