ఉలవపాడు: శ్రీనివాస హేచరీ యాజమాన్యంపై కేసు నమోదు

74చూసినవారు
ఉలవపాడు: శ్రీనివాస హేచరీ యాజమాన్యంపై కేసు నమోదు
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం అలగాయపాలెంలోని శ్రీనివాస హెచరీ యాజమాన్యంపై పోలీసు కేసు నమోదు అయ్యింది. అనకాపల్లి జిల్లాకు చెందిన బాలుడు పదవ తరగతి చదువుతున్నాడు. సెలవుల నిమిత్తం స్నేహితులతో కలిసి శ్రీనివాస హెచరిలో పనికి వచ్చాడు. అక్కడ పనిచేస్తుండగా ప్రమాదానికి గురైయ్యాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయంపై బాధితుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు శుక్రవారం ఎస్సై అంకమ్మరావు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్