ఉలవపాడు: వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే

79చూసినవారు
ఉలవపాడు: వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే
ఉలవపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్