ఉలవపాడు మండలం కరేడులో భూసేకరణపై శుక్రవారం జరిగిన గ్రామసభ ఉద్వేగభరితంగా సాగింది. అధికారులు అభిప్రాయం కోరగానే వాతావరణం వేడెక్కింది. వేలాది గ్రామస్థులు అక్కడికి చేరి ముక్తకంఠంగా నిరసన తెలిపారు. రైతులు, మహిళలు తమ భూములు ఇండోసోల్‌కు ఇవ్వలేమని ఘాటుగా వ్యతిరేకించారు. ఆ ప్రాంగణం నిరసన నినాదాలతో మార్మోగింది.