ఉలవపాడు: సెలవులకని వచ్చి.. గాయపడ్డ బాలుడు

62చూసినవారు
ఉలవపాడు: సెలవులకని వచ్చి.. గాయపడ్డ బాలుడు
వేసవి సెలవుల్లో తన స్నేహితులను కలుసుకునేందుకు అనకాపల్లి జిల్లా ఎదటం గ్రామానికి చెందిన ఓ బాలుడు ఉలవపాడు మండలం అలగాయపాలెంకు వచ్చాడు. అక్కడ ఓ హేచరీలో వారితో కలిసి పని చేస్తున్నాడు. మే 27న రొయ్య పిల్లల ట్యాంకు శుభ్రం చేస్తుండగా నిచ్చెన మీద నుంచి జారిపడి తలకు, కంటికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై హేచరీ యజమానిపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్